హైదరాబాద్ ఇంటి యజమానులకు బిగ్ అలర్ట్: ఇకపై ఇంకుడు గుంత తప్పనిసరి

హైదరాబాద్ నగరవాసులకు జలమండలి కీలక హెచ్చరిక జారీ చేసింది. నగరంలో నీటి కొరత తీవ్రరూపం దాల్చడంతో, 300 గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్ల యజమానులు తప్పనిసరిగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.

Update: 2025-07-15 16:12 GMT

హైదరాబాద్ ఇంటి యజమానులకు బిగ్ అలర్ట్: ఇకపై ఇంకుడు గుంత తప్పనిసరి

హైదరాబాద్ నగరవాసులకు జలమండలి కీలక హెచ్చరిక జారీ చేసింది. నగరంలో నీటి కొరత తీవ్రరూపం దాల్చడంతో, 300 గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్ల యజమానులు తప్పనిసరిగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ఈ నియమాన్ని పాటించని వారు నీటి ట్యాంకర్లను బుక్ చేసుకుంటే, వారికి ట్యాంకర్ల ధరలను పెంచుతామని జలమండలి స్పష్టం చేసింది. గత ఏడాదితో పోలిస్తే నగరంలో నీటి ట్యాంకర్ల బుకింగ్‌లు 36 శాతం పెరిగాయని అధికారులు తెలిపారు. వర్షాభావం కారణంగా భూగర్భ జల మట్టాలు గణనీయంగా తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జలమండలి పేర్కొంది. ఈ చర్య తక్షణ నీటి కొరతను అధిగమించడమే కాకుండా భవిష్యత్తులో భూగర్భ జల మట్టాలను పెంచడంలో కీలక పాత్ర పోషించనుందని అధికారులు స్పష్టం చేశారు. నగరానికి దీర్ఘకాలిక నీటి భద్రత కల్పించేందుకు ఇది ఒక వ్యూహాత్మక చర్యగా జలమండలి పేర్కొంది.

Tags:    

Similar News