మీకు మేమున్నాం అంటున్న రాచకొండ పోలీసులు...41 ఆశ్రమాల దత్తత

రాష్ట్రంలో లాక్ డౌన్ సమర్థవంతంగా కొనసాగడానికి పోలీసులు కృషి చేయడం మాత్రమే కాదు ఆకలితో అలమటిస్తున్న ఎంతో మంది పేద వారిని కూడా ఆదరిస్తున్నారు.

Update: 2020-04-26 13:04 GMT

రాష్ట్రంలో లాక్ డౌన్ సమర్థవంతంగా కొనసాగడానికి పోలీసులు కృషి చేయడం మాత్రమే కాదు ఆకలితో అలమటిస్తున్న ఎంతో మంది పేద వారిని కూడా ఆదరిస్తున్నారు. దిక్కు ముక్కు లేని వారికి తామున్నామంటూ భరోసాను కల్పిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే రాచకోండ పోలీసు కమిషనరేట్‌ 41 అనాథ, వృద్ధాశ్రమాలు, ప్రత్యేక అవసరాలు కలిగినవారి ఆశ్రమాలను దత్తత తీసుకుంది. ఈ 41 ఆశ్రమాలలో సుమారు 1630 మంది ఉంటునట్లు గుర్తించామని కమిషనర్ తెలిపారు.

వారికి కావలసిన నిత్యావసర వస్తువులను, కిరాణా సామాన్లను, మందులను వారికి అందిస్తున్నారు. వీరితో సమంగా కొన్ని ఎన్ జీవోలు కూడా వారికి చేయూతను ఇస్తున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ఆశ్రమనిర్వహణ దారులు బయటలకు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. ఆశ్రమ నిర్వహకులు ప్రస్తుతం వారి వారి ఇండ్లకే పరిమితం అయ్యారని వారు తెలిపారు.

ఆశ్రమంలో ఉండే వారికి ఎవరికి ఏం కావాలన్నా వారికి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో తెలియజేస్తే స్థానిక పోలీస్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ వివరాలను కమిషనరేట్‌కు అందిస్తారని చెప్పారు. పోలీస్‌ కమిషనరేట్‌లోని సిటిజన్‌ వాలంటీర్‌ సెల్‌ ఈ ఆశ్రమాలకు రేషన్‌, ఆహారం, ఇతర పదార్థాల సేకరణ, పంపిణీని నిర్వహిస్తుందని ఆయన వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోవద్దని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు ఇంటిపట్టునే ఉంటూ లాక్ డౌన్ ను సంపూర్ణంగాపూర్తి చేయాలిన సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  

Tags:    

Similar News