Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం, స్పాట్‌లో ఐదుగురు మృతి
Jogulamba Gadwal: *రాత్రి కురిసిన వర్షానికి కూలిన గుడిసె *నిద్రిస్తున్న సమయంలో ఏడుగురిపై కూలిన గోడ
Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం, స్పాట్‌లో ఐదుగురు మృతి
Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అయిజ మండలం కొత్తపల్లి గ్రామంలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి గుడిసె కూలి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. మరో పాప మాత్రమే ప్రాణాలతో బయటపడింది. మృతిచెందిన వారిలో నలుగురు చిన్నారులు మరో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు.
ప్రమాదం జరిగినప్పుడు గుడిసెలో మొత్తం ఏడుగురు ఉన్నారు. మోష, సుజాతమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. నలుగురు మగ పిల్లలు ఒక అమ్మాయి. వీరంతా రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం పాప స్నేహ మాత్రమే బ్రతికి ఉంది. ఈ ఘటనతో గ్రామ మొత్తం విషాదంలో మునిగిపోయింది.