Nizamabad: దారుణం..కన్నబిడ్డలు చూస్తుండగానే భార్యను కిరాతకంగా హత్యచేసిన భర్త

Update: 2025-05-20 00:56 GMT

Nizamabad: దారుణం..కన్నబిడ్డలు చూస్తుండగానే భార్యను కిరాతకంగా హత్యచేసిన భర్త

Nizamabad: భార్యపై అనుమానం రాక్షసుడిగా మార్చింది. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. విడాకులు తీసుకునే వరకు వెళ్లింది. అయినా కోపం తగ్గలేదు. మానవమ్రుగంగా మార్చేసింది. కన్నబిడ్డల ముందే భార్యను అతికిరాతకంగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు భర్త. తల్లి మరణంతో కుమార్తెలు గుండెలవిసేలా ఏడ్చారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రెంజర్ల మండల కేంద్రానికి చెందిన ముద్దంగుల గంగాధర్ కు జగిత్యాల జిల్లా మెట్ పల్లి ప్రాంతానికి చెందిన ముద్దంగుల అంజలితో 18ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి స్పందన, ఇందు అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండు సంవత్సరాలుగా భార్యభర్తలు దూరంగా ఉంటున్నారు. బోధన్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల దరఖాస్తు కూడా చేశారు. భర్త గల్ఫ్ లో ఉండగా..ఆమె కుమార్తెలతో కలిసి ఆర్మూర్ లో ఉంటుంది. గంగాధర్ దుబాయి నుంచి నెల క్రితం వచ్చాడు. విడాకులు విషయం గురించి ఆమెను సోమవారం బోధన్ కోర్టుకు రావాలని పిలిపించి నిజామాబాద్ లో కలిశాడు.

కోర్టుకు అవసరం లేదని చెప్పి..ఆర్మూర్ కు వచ్చింది. ఆమె నివాసానికి గంగాధర్ కూడా వచ్చాడు. అనుమానంతో కత్తితో గొంతు కోస్తుండగా..కూతుర్లు వద్దంటూ అడ్డుకన్నారు. అయినా వినకుండా గంగాధర్ హత్య చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేడుతున్నట్లు తెలిపారు. 

Tags:    

Similar News