హోంగార్డు వేతనం @ రూ. 22,000

Update: 2019-05-04 03:42 GMT

తెలంగాణలో హోంగార్డుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. దీంతో వారి వేతనం రూ. 22 వేలకు చేరింది. ఇక నుంచి కానిస్టేబుళ్లతో సమానంగానే ప్రతీనెల ఒకటో తేదీనే హోంగార్డులకు వేతనాలు అందనున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. హోంగార్డులకు రెండు పడక గదుల ఇళ్లు, ఆరోగ్య బీమా సదుపాయం కల్పించనున్నట్టు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోంగార్డుల వేతనం కేవలం రూ. 12 వేలుగా ఉండగా.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2018 జనవరి నుంచి వారి వేతనాన్ని రూ. 20 వేలకు పెంచింది. ఏటా ఏప్రిల్‌ నుంచి వెయ్యి రూపాయలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో 2018 ఏప్రిల్‌లో హోంగార్డుల వేతనం రూ. 21 వెయ్యికి పెరిగింది. 2019 ఏప్రిల్‌లో మరో వెయ్యి పెరగడంతో ఇప్పుడు హోంగార్డుల వేతనం రూ. 22 వేలకు చేరింది. ట్రాఫిక్‌ విధులునిర్వర్తించే హోంగార్డులకు పోలీసుల తరహాలో గౌరవవేతనంపై 30 శాతం అదనంగా ఇవ్వనున్నారు. మహిళా హోంగార్డులకు ఆరు నెలలు మాతృత్వపు సెలవులు, పురుష హోంగార్డులకు 15 రోజులపాటు పితృత్వపు సెలవులు కూడా గతంలో మంజూరు అయ్యాయి. 

Similar News