కరీంనగర్ కొత్తపల్లిలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన బండి సంజయ్
Karimnagar: BRS నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ ఆందోళన
కరీంనగర్ కొత్తపల్లిలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన బండి సంజయ్
Karimnagar: కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో కొత్తపల్లికి బండి సంజయ్ చేరుకుని ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ నేతలు ఓటర్ల స్లిప్పుల్లో డబ్బులు పంచుతుండగా బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయి బీజేపీ నేతలతో ఘర్షణకు దిగారు. సమాచారం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు కొత్తపల్లికి రావడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.