మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Update: 2019-10-01 14:46 GMT

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు.. మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయరాదని.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్‌ ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. ఎన్నికల ముందు జరిగే ప్రక్రియలన్నింటినీ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. గతంలో ఎన్నికల కమిషన్‌ చెప్పిన విధానాన్ని పాటించాలన్న హైకోర్టు.. ప్రీ ఎలక్షన్‌ ప్రాసెస్‌ మొత్తం పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. దసరా సెలవుల తర్వాత మరోసారి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.  

Tags:    

Similar News