చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట

Update: 2019-12-17 02:17 GMT
తెలంగాణ హై కోర్టు

వాస్తవాలను దాచిపెట్టి మోసపూరితంగా చెన్నమనేని రమేశ్ భారతీయ పౌరసత్వం పొందారని కేంద్రం తన పౌరసత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. భారత పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్‌ పది ప్రకారం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసారు. రద్దుకు సంబంధించి కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు గత నవంబర్‌లో స్టే ఇచ్చింది. ప్రస్తుతం పౌరసత్వం రద్దుపై వాదనలు జరగగా స్టేను ఇవ్వడానికి హైకోర్టు మరో 8 వారాల వరకు సమయాన్ని పొడిగించింది.

ఇటీవల జరిగిన విచారణలో భాగంగా ఉత్తర్వులను జారీ చేయడానికి సమయాన్ని పొడిగిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే రమేశ్‌ జర్మనీ పౌరసత్వం రద్దయిందో లేదో పూర్తి వివరణను ఇవ్వాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం తరువాతి విచారణను 4 వారాల తరువాత జరపనున్నట్టు తెలిపింది. ఇదిలా ఉంటే గతంలో కూడా రమేష్‌బాబు పౌరసత్వం చెల్లదంటూ 2009లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదుచేశారు.




Tags:    

Similar News