Weather Update: నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేయనున్న వానలు
Weather Update: పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం..నెల్లూరుకు దగ్గరలో ఉందని వాతావరణశాఖ చెబుతోంది. క్రమంగా ఒంగోలు, గుంటూరు వైపు కదులుతోంది.
Weather Update: నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేయనున్న వానలు
Weather Update: పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం..నెల్లూరుకు దగ్గరలో ఉందని వాతావరణశాఖ చెబుతోంది. క్రమంగా ఒంగోలు, గుంటూరు వైపు కదులుతోంది. 21వ తేదీ నాటికి మచిలీపట్నానికి దగ్గరలోకి వచ్చే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మొదలై మేఘాలు, 5.8కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. ఈ వర్షం కురిస్తే బెంగుళూరులో నెలకున్న పరిస్థితి వస్తుంది. బెంగళూరులో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు నైరుతీ రుతుపవనాలు జోరుగా ఉన్నాయి. మధ్య మహారాష్ట్ర నుంచి కర్నాటక, రాయలసీమపై ఒక ద్రోణి ఉంది.
ఓ వారంరోజుల పాటు తెలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణ, యానాం, పుదుచ్చేరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 19, 20 తేదీల్లో తెలంగాణ, కోస్తాంధ్ర యానాంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. 20, 21న కర్నాటకలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. రోజంతా మేఘాల వాతావరణం ఉంటుంది. సాయంత్రం సమయంలో పశ్చిమ తెలంగాణ మహబూబ్ నగర్, తాండూరు, నిజామాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ అంచనాలు వేగంగా మారుతున్నాయి. పశ్చిమం నుంచి భారీ మేఘాలు వస్తే పశ్చిమ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.