తెలంగాణకు భారీ వర్ష సూచన

♦ మరో ఐదు రోజులు భారీ వర్షాలు ♦ పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ♦ ఈశాన్య రుతుపవనాలకు తోడైన ఉపరితల ద్రోణి ♦ ద్రోణి ప్రభావంతో విస్తారంగా కురవనున్న వర్షాలు ♦ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక ♦ ఉరుములు, మెరుపులతో వర్షాలు అవకాశాలు

Update: 2019-10-21 03:56 GMT

ఎడతెరపి లేకుండా వరుసగా కురుస్తున్న వర్షాలు తెలంగాణను నిండా ముంచేస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి తోడవ్వడంతో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఓవైపు నిత్యం భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్న టైంలో వాతావరణశాఖ భారీ వర్ష సూచన అంటూ హెచ్చరించడంతో ప్రజలు కలవరపడుతున్నారు. వచ్చే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరించిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అదే విధంగా ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా రాగల మూడు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News