Heavy Rains: నేడు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ

Update: 2025-05-16 00:24 GMT

Heavy Rains: నేడు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో రాత్రి సమయాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పగటివేళ వేడి కారణంగా..తేమ కూడా పూర్తిగా తగ్గిపోతోంది. రాత్రి మాత్రం తేమ భారీగా పెరుగుతోంది. దీంతో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ రోజు దాదాపు కుంభవ్రుష్టి వర్షం కురవబోతోందని వాతావరణ శాఖ చెబుతోంది. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం భారత్ లో వచ్చే 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వీటిలో ఏపీ, తెలంగాణ, యానాం, పుదుచ్చేరి, తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్రలోని కొంత భాగంలో వర్షాలు కురుస్తాయి. పిడుగులు, ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని తెలిపింది. గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల తో ఉంటుందని తెలిపింది.

నేడు ఏపీ, తెలంగాణలో గాలివేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుందని చెప్పింది. కొన్ని సందర్భాల్లో గాలి వేగం గంటకు 70కిలోమీటర్లకు కూడా చేరుతుందని తెలిపింది. సాధారణంగా తుపాన్ వచ్చినప్పుడు మనకు ఇలాంటి గాలులు వీస్తాయని..ఇప్పుడు తుపాన్ లేకపోయినా ఈ పరిస్థితి ఉందని తెలిపింది. నేడు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక రాత్రి 10 తర్వాత ఉత్తర తెలంగాణలో భారీ వర్షం కురుస్తుంది. అది 17వ తేదీ ఉదయం 5గంటల వరకు ఉంటుందని తెలిపింది. అర్థరాత్రి హైదరాబాద్ లో జల్లులు లేదా మోస్తరు వర్షం కురిసేలా ఉంది.

Tags:    

Similar News