హైదరాబాద్‌లో భారీ వర్షం

Update: 2020-05-16 09:53 GMT

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.

హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, నాంపల్లి, కాచిగూడ, నల్లకుంట, అంబర్ పేట, మెహిదీపట్నం, పంజగుట్ట, టోలిచౌకి, దర్గా, గోల్కొండ, యూసుఫ్ గూడ, ఎర్రగడ్డ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, తార్నాక, కూకట్ పల్లి, మియాపూర్, ఫిల్మ్ నగర్, కొండాపూర్, బోరబండ, కొత్తగూడ, మాసాబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల ఈదురుగాలులకు ఫ్లెక్సీలు కూలిపడ్డాయి. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడ్డారు.

Tags:    

Similar News