హైదరాబాద్ లో భారీ వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటలు..

Update: 2019-01-27 01:41 GMT

భారీ వర్షంతో హైదరాబాద్‌ అతలాకుతలం అయింది. నిన్న రాత్రి 9 గంటలనుంచి నుంచి అర్ధరాత్రి 12 గంటలవరకు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. రోడ్ల మీద మోకాలు లోతు నీళ్లు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పాతం నమోదైంది. మధ్యహ్నం చిరుజల్లులు పడగా రాత్రి మాత్రం వర్షం దంచి కొట్టింది. అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌ నగర్, చింతల్ సూరారం, కొంపల్లిలలో దాదాపు మూడు గంటలపాటు గ్యాప్ లేకుండా వర్షం కురిసింది. 3.5 సెంటి మీటర్ల వర్షం కురిసింది. తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా ఆంధ్ర తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

Similar News