Singareni Coal Mines: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి హరీష్‌రావు లేఖ
Singareni Coal Mines: సింగరేణిలో అవినీతి, టెండర్ల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు.
Singareni Coal Mines: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి హరీష్‌రావు లేఖ
Singareni Coal Mines : కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత తన్నీరు హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. సింగరేణి కాలరీస్ కంపెనీలో చోటుచేసుకున్న అవినీతి, టెండర్ల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని లేఖలో డిమాండ్ చేశారు.
సింగరేణి నిధులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వృథా చేస్తోందని ఆరోపించిన హరీష్‌రావు, ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి కీలకమైన సింగరేణి సంస్థలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.
సింగరేణి టెండర్లలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, పూర్తి స్థాయి స్వతంత్ర విచారణ జరిపించాలని హరీష్‌రావు లేఖలో స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ భవిష్యత్తును కాపాడాలంటే కేంద్రం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.