Harish Rao: కులవృత్తులను బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
Harish Rao: లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీశ్
Harish Rao: కులవృత్తులను బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
Harish Rao: సిద్ధిపేటలో బీసీ వెల్పేర్ ఆధ్వర్యంలో కులవృత్తులను ప్రోత్సహం కోసం లక్ష రూపాయల గ్రాంట్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని 300 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కుల వృత్తులను బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
షూరిటీ, డాక్యుమెంట్స్ లేకుండా నేరుగా గ్రాంట్ రూపంలో లక్ష రూపాయలు అందించేలా ఆలోచన చేశారని వివరించారు. అన్నీ కులాలలో అర్హులైన వారందరికీ దశల వారీగా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, పారదర్శకంగా ఈ పథకానికి అర్హులను ఎంపిక చేశామని, ప్రభుత్వం అందించే లక్ష రూపాయల గ్రాంట్ స్వయం ఉపాధి కోసం వినియోగించి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.