Harish Rao: దివ్యాంగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది
Harish Rao: కాంగ్రెస్ పెన్షన్ హామీపై స్పందించిన మంత్రి హరీష్
Harish Rao: దివ్యాంగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది
Harish Rao: కాంగ్రెస్ పెన్షన్ హామీపై స్పందించారు మంత్రి హరీష్ రావు. హస్తం పార్టీ నేతలకు నిజాయితీ ఉంటే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 4 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంచేస్తున్నారని మండిపడ్డారాయన. సిద్దిపేటలోని శివమ్స్ గార్డెన్స్‌లో దివ్యాంగులకు ఉచిత బస్ పాసుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. దివ్యాంగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఆయన..ఇటీవలే పెన్షన్ పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.