Harish Rao: కార్మికులకు డిజిటల్ లేబర్ కార్డులు
Harish Rao: కార్మికులకు రైతు బీమా తరహా పథకాలు
Harish Rao: కార్మికులకు డిజిటల్ లేబర్ కార్డులు
Harish Rao: కార్మికులకు డిజిటల్ లేబర్ కార్డులు అందిస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కార్మికులకు రైతు బీమా తరహా పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కార్మికుల ప్రమాద బీమా 1లక్ష 30వేల నుంచి 3లక్షలకు పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ రంగాల కార్మికుల జిల్లా మహాసభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.
ఫోన్ లైన్‌లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో మాట్లాడి, మైక్ లో మంత్రి హరీష్ రావు వినిపించారు. మంత్రి హరీష్ రావు తెలిపినట్లు కార్మికులకు అండగా ఉంటానని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఫోన్ లైన్ లో తెలిపారు. భవన నిర్మాణ కార్మికులందరూ కలిసికట్టుగా ఉంటే, శక్తి మేర మీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.