Tamilisai Soundararajan: మళ్లీ గుర్తు చేస్తున్నా.. ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ దగ్గరగా ఉంది

Tamilisai Soundararajan: గవర్నర్‌ తమిళిసై ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ దగ్గరుందని ట్వీట్

Update: 2023-03-03 06:23 GMT

Tamilisai Soundararajan: మళ్లీ గుర్తు చేస్తున్నా.. ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ దగ్గరగా ఉంది

Tamilisai Soundararajan: తెలంగాణలో గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. గవర్నర్ బిల్లులను ఆమోదించడం లేదంటూ.. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ దగ్గరగా ఉందంటూ కౌంటర్‌ ఇచ్చారు గవర్నర్ తమిళిసై. సీఎస్‌పై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నాక రాజ్‌భవన్‌కు కూడా రాలేదన్న గవర్నర్‌.. మర్యాదపూర్వకంగా కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదన్నారు. 




Tags:    

Similar News