జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం..ఇకపై పూలబోకేల్లో..

జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పూల బొకేల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.

Update: 2019-08-17 04:54 GMT

జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పూల బొకేల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. పెళ్లికి, పండుగలకు ఇతరత్రా కార్యక్రమాల్లో అభినందన పూర్వకంగా పూల బొకే ఇవ్వడం చాలా రోజుల నుండే అలవాటుగా వోస్తుంది. అయితే వాటిల్లో వాడుతున్న 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌ కవర్ల వల్ల పర్యావరణానికి పెను ముప్పు పొంచిఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ తెలిపారు. శుక్రవారం పూలబొకేల తయారీదారులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొకేలకు ప్లాస్టిక్‌ కవర్లకు బదులు అందమైన క్లాత్‌లు, పేపర్‌, జనపనార, బయోడిగ్రేడబుల్‌ కవర్లు చుట్టాలని పూలబొకేల తయారీదారులకు ఆదేశించారు. గ్రేటర్‌లో 500 వరకు పూలబొకేలు విక్రయించే దుకాణాలుండగా, పూర్తిస్థాయిలో నియమ నిబంధనలు రూపొందించి స్టాండింగ్‌ కమిటీ ఆమోదం అనంతరం అమల్లోకి తీసుకురానున్నారు. 

Tags:    

Similar News