GHMC Raids: ఈ-కామర్స్ స్టోర్లపై GHMC ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు..
హైదరాబాద్‌లో ఈ-కామర్స్ స్టోర్లు, డెలివరీ సెంటర్లపై GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన స్టోర్లపై సడన్ రెయిడ్లు జరిపారు.
GHMC Raids: ఈ-కామర్స్ స్టోర్లపై GHMC ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు..
హైదరాబాద్‌లో ఈ-కామర్స్ స్టోర్లు, డెలివరీ సెంటర్లపై GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన స్టోర్లపై సడన్ రెయిడ్లు జరిపారు. మొత్తం 27 స్టోర్లను పరిశీలించగా, ఈగలు, దోమలు తిరుగుతున్న ఘటనలు బయటపడ్డాయి. స్టోర్లలో పనిచేస్తున్న సిబ్బంది ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను అసలు పాటించడంలేదని అధికారులు గుర్తించారు. దీంతో అక్కడి నుంచి 36 ఫుడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.
ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లలో నాసిరకం వస్తువులు డెలివరీ అవుతున్నాయన్న పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు GHMC వెల్లడించింది. హైజీన్ లోపాలు, ఫుడ్ హ్యాండ్లింగ్ లో నిబంధనలు పాటించకపోవడం వంటి అంశాలు బయటపడ్డాయి.
ఇక ఫుడ్ భద్రత ప్రోటోకాల్స్‌ను పాటించడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) స్పష్టం చేసింది. ఈ నెల 9న 70 మందికి పైగా ఈ-కామర్స్ ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా, సంస్థలన్నీ తమ ఇన్‌వాయిసులపై లైసెన్స్/రిజిస్ట్రేషన్ నంబర్లను తప్పనిసరిగా ముద్రించాలని ఆదేశించింది. అలాగే స్టోరేజ్ కేంద్రాల్లో పరిశుభ్రత పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. అయినా కొన్ని సంస్థలు ఇంకా ఈ సూచనలను పాటించడంలేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.