Warangal: మిషన్ భగీరథ అంటే పైపులు పగులగొట్టడమేనా..?

మిషన్ భగీరథ అంటే 365 రోజులు జేసీబీలతో పైపులు పగలగొడుతూ, మళ్ళీ జాయింట్ చేస్తూ ఉండే ప్రక్రియేనా అని మంగపేట మండలంలోని గంపోనిగూడెంకి చెందిన గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Update: 2020-03-11 08:01 GMT

మంగపేట:మిషన్ భగీరథ అంటే 365 రోజులు జేసీబీలతో పైపులు పగలగొడుతూ, మళ్ళీ జాయింట్ చేస్తూ ఉండే ప్రక్రియేనా అని మంగపేట మండలంలోని గంపోనిగూడెంకి చెందిన గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న మిషన్ భగీరథ పైపులు నిత్యం పగిలి పోతుండటంతో విపరీతమైన నీళ్ల సమస్య నెలకొంటుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మిషన్ భగీరథ ఇంజనీరింగ్ విభాగంలో గొప్ప గొప్ప మేధావులు ఉండి కూడా నెట్ వర్క్ కేబుల్స్ , మిషన్ భగీరథ పైపులు పక్కపక్కనే వేయడంతో బిఎస్ఎన్ఎల్ కేబుల్స్ సమస్య పరిష్కారం కోసం జెసీబీలతో తమ కేబుల్స్ బయటకు తీసే క్రమంలో మిషన్ భగీరథ పైపులు పగల కొడుతుండటంతో లీకేజీలు ఏర్పడి నీళ్లు రావడం లేదని అంటున్నారు.

ఎవరికి వారు ఇష్టానుసారంగా జెసీబిలు పెట్టి తోడేస్తు కొత్త సమస్యను తెచ్చి పెడుతున్నారని జెసీబీలతో తోడిన క్రమంలో మిషన్ భగీరథ పైపులు పగలగా వాటికి మరమ్మతులు చేపట్టకుండా నెలల తరబడి ఉండటంతో నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని, నిత్యం ఈ సమస్యలతో ఇబ్బంది పడటం తప్ప నీళ్ళ సమస్య రాకుండా పరిస్కారం చెయ్యరా అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మిషన్ భగీరథ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని మంచి నీళ్ల సమస్య పునరావృతం అవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు .



Tags:    

Similar News