ఏసీబీ కోర్టులో గాలి బెయిల్‌ డీల్‌ కేసు: సెప్టెంబర్12కు వాయిదా

గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ డీల్ కేసును.. విచారించిన ఏసీబీ కోర్టు.. తదుపరి విచారణను.. వచ్చే నెల 12 కు వాయిదా వేసింది.

Update: 2019-08-26 08:38 GMT

గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ డీల్ కేసును.. విచారించిన ఏసీబీ కోర్టు.. తదుపరి విచారణను.. వచ్చే నెల 12 కు వాయిదా వేసింది. గతంలో అక్రమమైనింగ్ కేసులో అరెస్ట్‌ అయి చంచలగూడ జైల్లో ఉన్న గాలి జనార్ధన్‌రెడ్డి.. బెయిల్‌ కోసం భారీ డీల్‌ కుదుర్చుకున్నాడు. దశరథరామిరెడ్డి మధ్యవర్తిత్వంలో ఏకంగా 100 కోట్లకు బెయిల్‌ కుదిర్చాడు. అయితే గాలి బెయిల్‌ డీల్‌ను ఏసీబీ బుక్‌ చేయడంతో.. భారీ కుట్ర వెలుగు చూసింది. ఏసీబీ విచారణలో దశరథరామిరెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు. అంతేకాకుండా.. అప్పట్లో గాలికి బెయిల్‌ మంజూరు చేసిన సీబీఐ జడ్జ్‌ పట్టాభిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు.. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 12 కు వాయిదా వేసింది. 

Tags:    

Similar News