Etela Rajender: ఎంతో మంది ప్రాణాలత్యాగ ఫలం స్వాతంత్ర్యం.. నామట్టి... నాదేశం.. సమరవీరులకు సంస్మరణ
Etela Rajender:
Etela Rajender: ఎంతో మంది ప్రాణాలత్యాగ ఫలం స్వాతంత్ర్యం.. నామట్టి... నాదేశం.. సమరవీరులకు సంస్మరణ
Etela Rajender: సాధించుకున్న స్వాతంత్ర్యం వెనుక ఎంతో మంది మహానుభావుల ప్రాణత్యాగాలు దాగి ఉన్నాయని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. స్వతంత్ర ఉద్యమంతో చరిత్రకెక్కని సమరయోధులు చాలా మంది ఉన్నారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చి 76 యేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగాంగా జమ్మికుంటలో ఆయన బీజేపీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వంత్రత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసినవారిని స్మరించుకుని, భరతభూమికి వందన సమర్పణ చేశారు.