ఆ ఫోన్ నంబర్ అందరికీ తెలియాలి : మాజీ ఎంపి కవిత

లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది నిరుపేదలు, వలస కూలీలు తినడానికి తిండి లేక అలమటించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.

Update: 2020-04-25 07:26 GMT
Former MP Kavitha(File photo)

లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది నిరుపేదలు, వలస కూలీలు తినడానికి తిండి లేక అలమటించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.దీంతో స్పందించిన ప్రభుత్వం వారికి నిలువ నీడను కల్పించి, భోజన వసతి కూడా కల్పిస్తుంది. అయినా అక్కడక్కడా కొంత మంది ఆకలికి అలమటిస్తునే వున్నారు. అలాంటి వారికోసమే ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎవరికైనా భోజనం కావాలనుకుంటే వారు వెంటనే కాల్‌ సెంటర్‌ నంబర్‌ 040- 21111111కి ఫోన్‌ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు.

కాగా ఈ నంబర్ అంతగా ప్రచారంలోకి రాకపోవడంతో మాజీ ఎంపీ కవిత ఈ ఫోన్‌ నంబర్‌ను విస్తృత ప్రచారంలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నెటిజన్లు తమకు తెలిసిన వారికి ఈ నంబర్లను ఫార్వర్డ్ చేయాలని, దాని ద్వారా నిరుపేదల కడుపు నింపొచ్చని ఆమె కోరారు. సీఎం కార్యాలయం తీసుకువచ్చిన ఈ సౌకర్యం ద్వారా ఏ ఒక్కరు ఆకలితో ఉండరని ఆమె పేర్కొన్నారు. ఎంతో మంది ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజిక కార్యకర్తలు సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు వలస కూలీలను, నిరుపేదలను ఎక్కడికక్కడ ఆదుకుంటున్నారని తెలిపారు. 

Tags:    

Similar News