అమ్మలా ఆదుకుంటున్న కల్వకుంట్ల కవిత...

నాయకులంటే ఎలక్షన్ల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చి గెలిచిన తరువాత పట్టించుకోని వారు కాదు.

Update: 2020-04-02 14:33 GMT
Annadanam for migrant labors

నాయకులంటే ఎలక్షన్ల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చి గెలిచిన తరువాత పట్టించుకోని వారు కాదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి కన్నీలను తుడిచినపుడే నాయకులవుతారు. అలాంటి నాయకుల జాబితాలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా నిలిచారు. ఆకలితో అలమటిస్తున్న పేద వారి కడుపు నింపి వారికి అమ్మగా మారుతున్నారు. నిజామాబాద్ , బోధన్, ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రుల వద్ద రేండేండ్ల నుంచి ఆమె అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో మూడు అన్నదాన కేంద్రాలను ఏర్పాటుచేసారు. ఈ కేంద్రాల్లో లాక్ డౌన్ విధించడంతో అన్నం దొరకని పేదవారి ఆకలిని తీరుస్తున్నారు.

ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చిన కూలీల కడుపునింపి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలంగాణ జాగృతి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు కవిత దృష్టికి తీసుకురావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కాలిసి అవసరమైన చోట అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేయించారు. ఈ కేంద్రాల్లో ప్రతి రోజు సుమారుగా 500 మందికి భోజనం అందించనున్నారు.

వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కేంద్రాలను ఈ రోజు ఉదయం నగర మేయర్ నీతూ కిరణ్ ప్రారంభించారు. అదే విధంగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాన్ని జెడ్పీ ఛైర్మన్ దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. వాటితో పాటుగానే మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో కూడా మరో అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు. రెండేండ్ల క్రితం పేదల కడుపు నింపడాని కవిత ప్రారంభించిన ఈ అన్నదాన కేంద్రాలు నిరాటంకంగా కొనసాగుతుంది.

Tags:    

Similar News