KTR: ప్రతిపక్ష పాత్రలో రాణిస్తాం.. ప్రజల గొంతుకై మాట్లాడుతాం
KTR: బీఆర్ఎస్‌కు రెండు సార్లు అధికారం ఇచ్చారు
KTR: ప్రతిపక్ష పాత్రలో రాణిస్తాం.. ప్రజల గొంతుకై మాట్లాడుతాం
KTR: రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి రెండు సార్లు అధికారం ఇచ్చారని, ఓడిపోతే భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తామని, ప్రజల గొంతుకై మాట్లాడుతామని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం వచ్చాయని, నిరాశ పడాల్సిన అవసరం లేదని, పోరాటాల నుంచి వచ్చామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన మాట్లాడుతామని ఆయన అన్నారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నారాయన.