Harish Rao: అభయ జ్యోతి ద్వార ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్‌రావు
Harish Rao: కేసీఆర్ దివ్యాంగులకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారు
Harish Rao: అభయ జ్యోతి ద్వార ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్‌రావు
Harish Rao: దేశంలోనే దివ్యాంగులకు 4 వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆరు వేలు ఇస్తామన్నారని, వెంటనే ఇవ్వాలని దివ్యాంగుల పక్షాన ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో లయన్స్, అలాయన్స్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు అభయ జ్యోతి ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ హరీష్‌రావు ప్రారంభించారు. దివ్యాంగ వికలాంగులకు అభయ జ్యోతి అందించే సేవలు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు. మానసిక దివ్యాంగుల అవసరాల కోసం తన జీతం నుంచి కొంత ఆర్థిక సాయం చేస్తానని మాజీ మంత్రి హరీష్‌రావు హామినిచ్చారు.