TBJP: తెలంగాణ బీజేపీకి షాక్.. మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా
TBJP: ఈనెల 18న కాంగ్రెస్‌లో చేరనున్న చంద్రశేఖర్
TBJP: తెలంగాణ బీజేపీకి షాక్.. మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా
TBJP: తెలంగాణ బీజేపీకి మాజీ మంత్రి చంద్రశేఖర్ షాకిచ్చారు. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాశారు చంద్రశేఖర్. తెలంగాణ ప్రభుత్వ అన్యాయాలను.. కేంద్ర ప్రభుత్వం నిలువరించలేకపోతుందని లేఖలో పేర్కొన్నారు చంద్రశేఖర్. కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న చంద్రశేఖర్‌ను రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇక చంద్రశేఖర్ ఈనెల 18న ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.