Karimnagar: మత్తు ఇంజక్షన్లతో.. ఎలుగుబంటిని బంధించేందుకు రంగంలోకి ఫారెస్ట్ అధికారులు
Karimnagar: రాత్రి నుంచి కరీంనగర్‌లో సంచరిస్తున్న ఎలుగుబంటి
Karimnagar: మత్తు ఇంజక్షన్లతో.. ఎలుగుబంటిని బంధించేందుకు రంగంలోకి ఫారెస్ట్ అధికారులు
Karimnagar: కరీంనగర్‌లో జనావాసాల మధ్యకు వచ్చిన ఎలుగుబంటి ఫారెస్ట్ అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఎలుగును బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వలలు వేసినా చిక్కకుండా తప్పించుకొని పొదల్లోకి పరుగులు పెట్టింది ఎలుగుబంటి. అయితే వరంగల్ నుంచి ఎలుగుబంటిని బంధించేందుకు వచ్చిన టీమ్ ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అయినా ఎలుగుబంటి తప్పించుకుంది ఎలుగుబంటి. ఇంజక్షన్‌తోనే సబ్ స్టేషన్ కంచె దూకి గుట్టల్లోకి వెళ్లింది.
రాత్రి కరీంనగర్ శివారు ప్రాంతంలో కనిపించిన ఎలుగుబంటి.. ఉదయం రేకుర్తి ప్రాంతంలో నడిరోడ్డుపైకి వచ్చేసింది. జనాల మధ్య హల్‌చల్ చేస్తూ.. పరుగులు పెట్టించింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.