జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా ను నిర్మూలిద్దాం: సీఐ రవికుమార్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలించాలంటే వైద్యులు సూచించే జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ ను నిర్మూలించవచ్చని పట్టణ ఇన్స్పెక్టర్ రవి కుమార్ అన్నారు.

Update: 2020-03-20 11:36 GMT
CI Ravikumar

తాండూరు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలించాలంటే వైద్యులు సూచించే జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ ను నిర్మూలించవచ్చని పట్టణ ఇన్స్పెక్టర్ రవి కుమార్ అన్నారు. తాండూరు పోలీస్ స్టేషన్కు వచ్చే సందర్శకుల కోసం స్టేషన్ ఆవరణలో చేతులు శుభ్రం చేసుకునేందుకు నీరు మరియు సబ్బు లు ఏర్పాటు చేశారు. స్టేషన్ లోపలికి వచ్చే ముందు చేతులు శుభ్రం తప్పనిసరి చేసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణానికి చెందిన ప్రజలు ఎవరైనా విదేశాలకు వెళ్లి స్వస్థలం వచ్చిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఐసోలేషన్ సెంటర్లో వైరస్ కు సంబంధించిన పరీక్షలు చేసుకోవాలని పోలీసులకు సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలి అని కోరారు .అంతేకాకుండా పరిసరాలను శుభ్రం చేసుకుంటూ వ్యక్తిగతంగా కూడా పరిశుభ్రతను పాటించాలని అన్నారు.

గుంపులు గుంపులుగా గుమ్మి కూడ వద్దని జనసమ్మర్దం ఉన్న చోటికి వెళ్లరాదని ఆయన అన్నారు. ఈనెల 22వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూ తప్పనిసరిగా ప్రజలంతా స్వీయ నిర్భందంలో ఉంటూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ ఇంటి నుండి బయటికి రాకూడదని అన్నారు.


Tags:    

Similar News