అమీర్‌పేటలో అగ్ని ప్రమాదం: మైత్రీవన కోచింగ్ సెంటర్‌లో మంటలు

అమీర్‌పేటలోని మైత్రీవన ప్రాంతంలో ఉన్న శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2025-12-10 05:36 GMT

అమీర్‌పేటలో అగ్ని ప్రమాదం: మైత్రీవన కోచింగ్ సెంటర్‌లో మంటలు

హైదరాబాద్‌: అమీర్‌పేటలోని మైత్రీవన ప్రాంతంలో ఉన్న శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, కోచింగ్ సెంటర్‌లోని బ్యాటరీలు పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం కారణంగా భయబ్రాంతులకు గురైన విద్యార్థులను వెంటనే భద్రంగా బయటకు తరలించారు.

ఇంటర్మీడియట్, టెక్నికల్ కోర్సులకు సంబంధించి అనేక కోచింగ్ సెంటర్లు ఉన్న ప్రాంతంలో ఈ ఘటన కలకలం రేపింది.

Tags:    

Similar News