Kothagudem: బలాదూర్‌గా తిరుగుతూ వేధింపులు.. కుమారుడిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి
Bhadradri Kothagudem: కొడుకును చంపి పోలీసుల ముందు లొంగిపోయిన తండ్రి రాజయ్య
Kothagudem: బలాదూర్‌గా తిరుగుతూ వేధింపులు.. కుమారుడిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..పాత కొత్తగూడెంలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసగా మారిన కొడుకు ప్రతి రోజూ వేధింపులకు పాల్పడుతుండడంతో తండ్రే కొడుకును హత్య చేశాడు. ఇంట్లో నిద్రపోతున్న కొడుకు శంకర్ ను తండ్రి రాజయ్య గొడ్డలితో నరికి చంపాడు. కొడుకును చంపిన తర్వాత రాజయ్య భద్రాచలం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. రాజయ్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది.