Road Accident: వికారాబాద్ జిల్లా పరిగిలో ఘోరరోడ్డు ప్రమాదం..నలుగురు స్పాట్ డెడ్

Update: 2025-05-20 01:03 GMT

Road Accident: వికారాబాద్ జిల్లా పరిగిలో ఘోరరోడ్డు ప్రమాదం..నలుగురు స్పాట్ డెడ్

Road Accident: వికారాబాద్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలు అయ్యాయి. మరణించినవారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పరిగి మండలం రంగాపూర్ సమీపానా బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన పలవురు టూరిస్టు బస్సులో పరిగిలో జరిగిన ఓ విందుకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా రోడ్డుపై నిలిపిన లారీని వీరి బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News