అకాల వర్షం.. దెబ్బతిన్న పంట చూసి రైతుల రోదన..!

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం అయ్యింది.

Update: 2020-03-19 16:19 GMT

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం అయ్యింది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాలలో పలు చోట్ల చిరుజల్లులు కురిసాయి. నల్గొండ జిల్లాలోనూ వడగండ్ల వాన భీబత్సాన్ని సృష్టించింది. భువనగిరి, జనగాం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ఏసిక్ వరి పంటలు, మామిడి పంటలు దెబ్బ తిని రైతులకు తీవ్రనష్టం వాటిల్లగా రైతులంతా ఆందోళన చెందుతున్నారు.

అదే విధంగా హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట, ఖైరతాబాద్, మణికొండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురవగా, సికింద్రాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. వర్షం పడిన సమయానికి ప్రజలు అధిక సంఖ్యలో రోడ్లపై రానందున్న ట్రాఫిక్ కు పెద్దగా అంతరాయం కలగలేదని నగరవాసులు చెబుతున్నారు.

శుక్రవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగి రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాజారావ్ తెలిపారు. ప్రస్తుతం విదర్భా దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఈ ఆవర్తనం 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఆవరించి ఉందని ఆయన తెలిపారు. ఈ కారణంగా తెలంగాణతో పాటు కోస్తా ఆంధ్రలోనూ అక్కడక్కడా చిరుజల్లులు పడతాయని ఆయన వివరించారు. యాదాద్రి, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. రైతులు పంటపొల్లాలో ఉండకూడదని హెచ్చరించారు.

వాతావరణం ఇక్క సారిగా మారిపోవడం వలన కొందరు ఆనందం వ్యక్తం చేసినప్పటికీ, మరికొందరు అకాల వర్షాలు ఎంటో అని ఆందోళన చేస్తున్నారు. ఇక మరికొంత మంది మారిన వాతావారణం కారణంగా కరోనా వ్యాప్తి ఎక్కడ అధికంగా వ్యాప్తి చెందుతుంలో అని భయపడుతున్నారు.


Full View


Tags:    

Similar News