తహశీల్దార్ కార్యాలయంపై పెట్రోల్ తో రైతు దాడి

Update: 2019-11-19 10:07 GMT
తహశీల్దార్ కార్యాలయం

తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ రైతులు వారి భూములకు చెందిన పాస్ పుస్తకాల గురించి రోజుల తరబడి తిరుగుతూనే ఉంటున్నారు. కాళ్లు అరిగేలా తిరుగుతున్నా వారిని పట్టించుకునే నాధుడే లేడు. అదే కోణంలో మొన్నటికి మొన్న కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి సహనం కోల్పోయిన ఓ రైతు తహసీల్దార్ విజయారెడ్డి పైన పెట్రోల్ తో దాడి చేశాడు.

ఆ సంఘటన మరవకముందే ఈ రోజు కూడా ఓ రైతు అదే కోణంలో తహశీల్దార్ కార్యాలయంపై పెట్రోల్ తో దాడి చేశాడు. ఎన్నో రోజులనుంచి తన భూమి పట్టా పాస్ పుస్తకాలను తనకు ఇవ్వాలంటూ తిరుగుతూనే ఉన్నాడు. అయినా ఆ రైతు గోడును ఎవరూ పట్టించుకోక పోవండంతో ఆగ్రహం తెచ్చుకుని పెట్రోల్ తో దాడికి దిగాడు.

ఈ సంఘటన కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి ఎమ్మార్వో కార్యాలయంలో మంగళవానం చోటుచేసుంది. కరీంనగర్ జిల్లా లంబాడిపల్లికి చెందిన కనకయ్య అనే రైతు తన పొలం పాస్‌పుస్తకాల కోసం కొన్నేండ్లుగా తహశీల్దార్ కార్యాలయానికి వెలుతున్నాడు. ఎన్ని సార్లు వెళ్లినా అక్కడ ఉన్న అధికారులు రేపు రా, మాపు రా అంటూ తిప్పించుకుంటున్నారు. దీంతో ఆ రైతు తన సహనాన్ని కోల్పోయి ఏకంగా పెట్రోల్ తో కార్యాలయానికి వచ్చాడు. తన పాసుపుస్తకం తనకు ఇవ్వాలంటూ కార్యాలయంలోని కంప్యూటర్లపై, ఇతరత్రా ఫైల్ల పై పెట్రోల్‌​ పోశాడు. అది గమనించిన సిబ్బంది వెంటనే ఆ రైతును అక్కడనుంచి బయటికి తోసేసారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రైతును అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో కార్యాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.



Tags:    

Similar News