ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన

జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు 90 నామినేషన్లను తిరస్కరించారు. మొత్తం వెయ్యి 8వందల 93 మంది అభ్యర్థులు 2వేల 5వందల 75 నామినేషన్లను దాఖలు చేశారు.

Update: 2020-11-21 15:24 GMT

జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు 90 నామినేషన్లను తిరస్కరించారు. మొత్తం వెయ్యి 8వందల 93 మంది అభ్యర్థులు 2వేల 5వందల 75 నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో బీజేపీ నుంచి 539, టీఆర్ఎస్ నుంచి 527, కాంగ్రెస్ నుంచి 348 మంది, టీడీపీ నుంచి 202 మంది అభ్యర్థులు బరిలో నిలిచి ఉన్నారు. వీరితోపాటు 613 మంది ఇండిపెండెట్లు నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇప్పటికే జీహెచ్ఎంసీ షెడ్యుల్ రాగా, డిసెంబర్ 01న పోలింగ్ జరగనుంది. 04 న ఫలితాలు రానున్నాయి. ఉదయం ఏడూ గంటల నుంచి ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలు మొదలు పెట్టేశాయి. 

Tags:    

Similar News