చెట్టు పడిపోయింది.. కనపడటం లేదా : హరిశ్ రావు

Update: 2019-08-03 08:51 GMT

మొక్కలునాటడం మరియు సంరక్షించడం అనేది మన బాధ్యత అని అన్నారు మాజీ మంత్రి హరిశ్ రావు.. సిద్దిపేట పట్టణంలో పర్యటిస్తున్న హరిశ్ రావు పాత బస్టాండ్ కరీంనగర్ రోడ్డులో ఒక షాప్ ముందు పడి ఉన్న చెట్టును గమనించి కారులో నుంచి దిగి నేరుగా షాప్ యజమాని దగ్గరికి వెళ్లారు... " ఏం బాబు చెట్టు కింద పడింది కనపడటం లేదా.... ! షాప్ ఓపెన్ చేసేప్పుడు చెట్టును చూడలేదా. ! రోజూ ఉన్న చెట్టు సరిగా లేదు అని గమనించ లేదా... ! చెట్టు అంటే అంత నిర్లక్ష్యమా..!! అని షాప్ యజమానిని అడిగారు.. అక్కడే ఉండి అతనితో కింద పడిన మొక్కను కర్ర తో కట్టించి సరి చేపించారు... మన ప్రాణం ఎంతో మొక్క ప్రాణం కూడా అంతే అని మరో సారి మొక్కను నిర్లక్ష్యం చేయొద్దు అని హితవు పలికారు. నాటిన మొక్కను నిర్లక్ష్యం చేస్తే ఆ మొక్కకు కూడా మనల్ని నిర్లక్ష్యం చెయాలి అని ఆలోచన వస్తే మన మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది అని అన్నారు.. మొక్కల సంరక్షణలో తన శ్రద్ధను ఈరోజు ప్రత్యక్షంగా చూపించారు హరిశ్ రావు ... 

Tags:    

Similar News