Etela Rajender: అసెంబ్లీ గొప్పగా నిర్వహించామని స్పీకర్ చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది.. మాకు కనీసం రూము కూడా ఇవ్వలేదు
Etela Rajender: గన్‌మన్ల రూములో కూర్చుని నోట్స్ రాసుకున్నాం
Etela Rajender: అసెంబ్లీ గొప్పగా నిర్వహించామని స్పీకర్ చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది.. మాకు కనీసం రూము కూడా ఇవ్వలేదు
Etela Rajender: అసెంబ్లీ సమావేశలు గొప్పగా నిర్వహించామని స్పీకర్ చెప్పడమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. బీజేపీ ఎమ్మెల్యేలకు కనీసం రూము కూడా ఇవ్వకపోవడంతో గన్ మెన్ల రూములో కూర్చొని నోట్స్ రాసుకున్నామన్నారాయన.. కేసీఆర్‌కు చట్టసభల మీద విశ్వాసం సన్నగిలిందనడానికి వర్షాకాల సమావేశాలే నిదర్శనం... ఒక సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు జరిగింది కేవలం 14 రోజులేనని, ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి దాదాపు 50 నుంచి 65 రోజులు సమావేశాలు జరిగేవన్నారు ఈటల.. ఎమ్మెల్యేలను గ్రామాలకు వెళ్లండి, పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసే వారిగా, విమర్శలు చేసే వారిని బెదిరించే వారిగా తయారు చేశారని ఈటల విమర్శించారు. తమపై అక్కసుతోనే బీఏసీ సమావేశానికి పిలువ లేదన్నారాయన...