భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో స్వల్ప భూకంపం

భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో ని పలు ప్రాంతాల్లో భూమి రెండు సెకన్ల పాటు కంపించింది.

Update: 2020-04-05 10:16 GMT

భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో ని పలు ప్రాంతాల్లో భూమి రెండు సెకన్ల పాటు కంపించింది. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ‌, బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతాల్లో సరిగ్గా మధ్యాహ్నం 12గంటల 40 నిమిషాలకు భూప్రకంపనలు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. భూమిలో ఒక్క సారి కదలికలు రావడంతో స్థానికులు ఇక్క సారిగా భయపడి ఇండ్ల నుంచి బయటకు ప‌రుగులు తీసారు.

బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించగా, భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ‌లో మాత్రం సుమారుగా మూడు పెకన్ల నుంచి 5 సెకండ్ల వారకు భూమిలో ప్రకంపనలు సంభవించాయని స్థానికులు చెబుతున్నారు. జిల్లా కేంద్రం భద్రాచలంలో కూడా భూమి కంపించిందంటూ స్థానికులు ఇండ్లనుంచి బయటకి పరుగులు పెట్టారని చెపుతున్నారు. ఈ సంఘటనలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏమి సంభవించకపోవడంతో ప్రజలు ఊపరి పీల్చుకున్నారు.

ఇక ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే, ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ప్రజలు మరింత భయపడుతున్నారు. ఒక్క సారిగా భూమి కంపించడంతో అందరూ బయటికి వచ్చామని, సామాజిక దూరం పాటించకుండా గుంపులుగా నిలుచున్నామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News