జనగామ జిల్లాలో మంత్రులను అడ్డుకున్న మహిళలు

Update: 2019-12-15 15:34 GMT

డబుల్ బెడ్ రూం ఇళ్లు పధకంలో భాగంగా మాకు అన్యాయం జరిగిందని, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం రాఘవాపూర్‌లోని కొందరు మహిళలు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్యను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారిని పోలీసులు బలవంతంగా తరలించడంతో రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలనీ నినాదాలు చేశారు.

రాఘవాపూర్‌లో కొత్తగా నిర్మించిన 40 రెండు పడకగదుల ఇళ్లను మంత్రులు ప్రారంభించారు. కాంగ్రెస్ హయంలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే పైరవీదారులకే దక్కేవని.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎవరికైనా ఇల్లు రాకపోతే కలత చెందొద్దని, రెండో విడతలో మరికొన్ని ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. 

Tags:    

Similar News