'కరోనా' వ్యవహారం: గాంధీ ఆస్పత్రిలో డాక్టర్‌ వసంత్‌ ఆత్మహత్యాయత్నం

Update: 2020-02-11 07:23 GMT
‘కరోనా’ వ్యవహారం: గాంధీ ఆస్పత్రిలో డాక్టర్‌ వసంత్‌ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో డాక్టర్‌ వసంత్‌ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కరోనా విషయంలో తనపై అకారణంగా చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో పెట్రోల్‌ డబ్బాతో ఆస్పత్రికి వచ్చిన డాక్టర్‌ వసంత్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంటుండగా ఆస్పత్రి సిబ్బంది అడ్డుకున్నారు. ఉన్నతాధికారులు తనపై కుట్రపన్నారని కావాలనే తనను ఇరికించారంటూ ఆవేదన చెందాడు. ఆస్పత్రిలో వసతులు లేమిపై తాను ప్రశ్నించడం వల్లే తనపై వేటు వేశారని ఆయన అన్నారు.

తాను మంత్రిని కలిశానని ఆయన నుంచి ఎలాంటి హామీ లభించిందని అన్నారు. చేయని నేరానికి తాను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా లేనని వసంత్ అన్నారు. దీనిపై సూపరిండెంట్ బయటకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ వ్యవహారంలో అనుమానిత కేసులను పాజిటివ్ కేసులుగా ప్రచారం చేయడంపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నలుగురు వైద్యులపై చర్యలు తీసుకుంది. ఇందులో డాక్టర్ వసంత్ కూడా ఉన్నారు. అయితే, తన తప్పేమీ లేకుండా సస్పెండ్ చేశారని వసంత్ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News