1 Lakh for BCs : ఈనెల 20 వరకు దరఖాస్తులకు గడువు.. సర్టిఫికెట్ల కోసం గంటల తరబడి ఎదురుచూపులు
Telangana దరఖాస్తుకు గడువు పెంచాలని కోరుతున్న లబ్ధిదారులు
Telangana: ఈనెల 20 వరకు దరఖాస్తులకు గడువు.. సర్టిఫికెట్ల కోసం గంటల తరబడి ఎదురుచూపులు
Telangana: తెలంగాణ తహశీల్దార్ ఆఫీస్‌ల్లో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. బీసీల్లోని కుల వృత్తుల కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించడంతో.. జనాలు ధృవీకరణ పత్రాల కోసం ఆఫీస్‌ల వద్ద బారులు తీరారు. బీసీ కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంతో జగిత్యాల జిల్లా వెల్గటూరు, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట తహశీల్దార్ ఆఫీస్‌లు కిటకిటలాడుతున్నాయి.
అటు మీసేవ కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులు అధికంగా రావడంతో ఆఫీసుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొని.. గంటల తరబడి దరఖాస్తుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. దీంతో లబ్ధిదారులు దరఖాస్తు గడువు పెంచాలని కోరుతున్నారు.