ఎస్సార్‌ నగర్‌లో క్రేన్‌ బీభత్సం

Update: 2019-05-05 14:51 GMT

హైదరాబాద్ ఎస్సార్‌ నగర్‌లో ఆదివారం ఓ క్రేన్‌ వాహనం బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి చిరు వ్యాపారుల దుకాణాలపైకి దూసుకెళ్లింది. దాంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా క్రేన్‌కు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడున్న స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు అక్కడకు చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనలో నాలుగు చిరువ్యాపారులు షాపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అలాగే ఓ కారు వెనుకభాగం పూర్తిగా దెబ్బతింది. 

Similar News