నగరంలో ఉచిత క్యాబ్ సర్వీసులు ప్రారంభం..
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మహేంద్ర లాజిస్టిక్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది.
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మహేంద్ర లాజిస్టిక్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది.సీనియర్ సిటిజన్స్, ఒంటరి తల్లులు, దివ్యాంగులకు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత రవాణా సేవలు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఈ అలైట్ క్యాబ్ సర్వీసులను కమిషనరేట్ కార్యాలయం వద్ద సీపీ అంజనీకుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు, సంబంధిత సామగ్రి, పోస్టాఫీసులు, మందులు, నిత్యావసర వస్తువులు, మందులు పంపిణీ చేసే వలంటీర్లు, హెల్త్ వర్కర్స్ కు ఈ క్యాబ్‌లు ఉచితంగా సేవలు అందిస్తాయన్నారు.
24 గంటల పాటు ఈ క్యాబ్ లు అందుటబాటులో ఉండి సేవలు అందిస్తాయని ఆయన తెలిపారు. నగరంలో ప్రస్తుతం 10 క్యాబ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన తెలిపారు. అత్యవసరంగా బయటికి వెళ్లాలనుకునే వారు ఈ క్యాబ్ సర్వీసులను వినియోగించుకోవాలని ఆయన పట్టణ ప్రజలకు సూచించారు. ఈ క్యాబ్ సర్వీసులను పొందాలనుకునేవారు 8433958158 నంబర్ కు కాల్ చేసి సంప్రదించాలని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ చౌవాన్, సంస్థ రీజినల్ హెడ్ శివాలి బోయిర్ తదితరులు పాల్గొన్నారు.