తెలంగాణలో 1500 పడకల ఆస్పత్రి ఏర్పాటు : మంత్రి ఈటెల

కరోనా బాధితుల సంఖ్య రాష్ట్రంలో పెరిగిపోవడంతో ఆస్పత్రలన్నీ నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటుంది.

Update: 2020-04-07 09:21 GMT
Etela Rajender, KTR

కరోనా బాధితుల సంఖ్య రాష్ట్రంలో పెరిగిపోవడంతో ఆస్పత్రలన్నీ నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటుంది. ఇప్పటికే నగరంలోని గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్ లాంటి ఆస్పత్రులను కరోనా ఆస్పత్రులుగా మార్చేసారు. అయినా రోగుల సంఖ్య అధికమవుతుండడంతో చైనా తరహాలో 1500 పడకల ఆస్పత్రిని తెలంగాణ సర్కార్‌ ఏర్పాటు చేసింది. ఒక్క సారిగా బాధితుల సంఖ్య పెరిగితే వారికి ఆలస్యం కాకుండా చికిత్స అందిందచేందుకు గచ్చిబౌలీలోని స్పోర్ట్స్‌ సెంటర్‌ను కరోనా ఆస్పత్రిగా ప్రభుత్వం మారుస్తోంది.

ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, ఈటెల రాజేందర్‌, వైద్యాధికారులు గచ్చిబౌలీలోనీ స్పోర్ట్స్‌ టవర్‌లో ఏర్పాటు చేసిన హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు గచ్చిబౌలీలో 1500 పడకల కోవిడ్‌ హాస్పిటల్‌ సిద్ధంగా ఉందని తెలపారు. దీంతో పాటుగానే మరో 22 మెడికల్ కళాశాలలను కరోనా హాస్పిటల్స్ గా మార్చామన్నారు. ఇది సీఎం కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతను చూపిస్తోందని అన్నారు.

అనంతరం మొయినాబాద్‌లోని భాస్కర్‌ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిని మంత్రులు సందర్శించారు. అక్కడి వైద్య సదుపాయాలను దగ్గరుండి మంత్రులందరూ పరిశీలించారు. అనంతరం మంత్రి కేటీఆర్ ఆస్పత్రుల్లోని అన్ని వార్డులను తనిఖీ చేశారు. ఇక చైనా దేశం కూడా కుప్పలుగా పెరిగిపోయిన కరోనా బాధితులకు వైద్యం అందించడానికి ఉన్నపలంగా వైరస్‌కు కేంద్ర స్థానమైన వూహాన్‌లో 10 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రిని నిర్మించింది. ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది.



Tags:    

Similar News