మహారాష్ట్రలో మరో 75 మంది పోలీసులకు కరోనా..

మహారాష్ట్రలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 2091 పాజిటివ్ కేసులు, 97 మరణాలు సంభవించాయి.

Update: 2020-05-27 07:40 GMT
Representational Image

మహారాష్ట్రలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 2091 పాజిటివ్ కేసులు, 97 మరణాలు సంభవించాయి. దాంతో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 54, 758కి చేరింది. ఇప్పటివరకు 1792 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు కొత్తగా మరో 75 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక ఇప్పటివరకు 849 మంది సిబ్బంది కోలుకోగా, సిబ్బందికి సంబంధించి 1,095 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రం మొత్తం 35,178 క్రియాశీల కేసులు ఉన్నాయి. 80 శాతం కేసులు రాష్ట్రంలో లక్షణాలు లేకుండా నమోదవుతున్నాయని..

మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజోయ్ మెహతా అన్నారు. ఇదిలావుంటే COVID-19 సంక్షోభంపై ప్రభుత్వానికి దోహదపడటానికి కేరళ నుండి 100 మంది నర్సులను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మహారాష్ట్రలోని యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాసింది. ఇక ముంబై నుండి కేరళకు రైలు పంపాలని భారత రైల్వే నిర్ణయించింది. అయితే దీని గురించి ఎటువంటి సమాచారం కేరళ ప్రభుత్వానికి ఇంకా అందలేదని తెలుస్తోంది.


Tags:    

Similar News