తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం.. ఇవాళ కొత్తగా మూడు

తెలంగాణలో ఇవాళ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరింతగా తగ్గుముఖం పట్టాయి.

Update: 2020-05-04 15:15 GMT
Representational Image

తెలంగాణలో ఇవాళ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరింతగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా మూడు కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1085కి చేరింది. ఈ మూడు కేసులూ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రోజు మరో 40 మంది కోలుకోని డిశ్చార్జి అయ్యారు. దీంతో సంఖ్య 585కి పెరిగింది. రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి 29మంది మరణించారు.


Tags:    

Similar News