Corona Effect: హైదరాబాద్ బ్లడ్ బ్యాంకుల్లో కరోనా ప్రభావం

కరోనా వైరస్ రాష్ట్రంలో వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది.

Update: 2020-03-16 11:47 GMT
Representational Image

కరోనా వైరస్ రాష్ట్రంలో వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, పార్కులను మూసివేసింది.వాటితో పాటుగానే పెళ్లిళ్లు, ఫంక్షన్లను కూడా మార్చి 31 వ తేదీ వరకు నిర్వహించ కూడాదని ఆయన సూచించింది. కాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నిబంధనలను అన్ని వర్గాల వారు అమలులోకి తీసుకు వస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని వ్యాపారస్తులు ఎంతో నష్టపోతున్నారు.

ఇక పోతే రాష్ట్రంలో కోరలు చాస్తున్న కరోనా ఎఫెక్ట్ తెలంగాణలోని బ్లడ్ బ్యాంకుల మీద కూడా పడింది. రాష్ట్రంలో ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గిపోతున్నాయి. గతంలో ఐటీ కంపెనీలు, కాలేజీల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించి అవసరమైనంత మేరకు రక్తాని సేకరించేవారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా రక్త దానం చేసే వారు ఆస్పత్రులకు వచ్చి రక్తం ఇవ్వడానికి వెనకాడుతున్నారు. ఈ కారణంగా ఆరోగ్య శిబిరాలకు రావడానికి కూడా రక్త దాతలు భయపడుతున్నారు. దీంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి.

ఈ కారణంగా తలసేమియా బాధితులు ముఖ్యంగా చిన్నారులు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని రక్తశిబిరం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఒక్కో బ్లడ్ బ్యాంకుల్లో రోజుకు 25 మంది తలసేమియా బాధితులకు రక్త మార్పిడి చేస్తారు. అంతే కాదు ప్రమాదాల బారిన పడి తీవ్రరక్త స్రావం అయిన వారికి ఈ బ్లడ్ బ్యాంకుల నుంచే రక్తాన్ని తీసుకెళతారు. కాగా వైరస్ కారణంగా అధిక సంఖ్యలో రక్తం ఇవ్వడానికి దాతలు ముందుకు రాకపోవడంతో రక్తం నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో ఆస్పత్రి రక్తం అవసరమయిన రోగి కుటుంబసభ్యులు ఎంతగానో బాధపడుతున్నారు.



Tags:    

Similar News