తెలంగాణలో కొత్తగా 74 కేసులు..

Update: 2020-05-30 16:23 GMT
Representational Image

తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న(శుక్రవారం) ఒక్క రోజే 169 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు అధికంగా 74 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 41 కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రం పరిధిలో 60 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 5, సంగారెడ్డి జిల్లాలో 3,మహబూబ్ నగర్ 2, సూర్యాపేట 1, జగిత్యాల 2, వనపర్తి 1, వరంగల్ అర్బన్ 1, వికారాబాద్ 1, మేడ్చల్ 1, నగర్ కర్నూల్ 1, నిజామాబాదు 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. వలస కూలీలు 9, విదేశాల నుంచి వచ్చిన వారిలో 5 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 77 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,499కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1010 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి ఇప్పటివరకు 1412 మంది డిశ్చార్జ్ అయ్యారు. అటు కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం మే31 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే!




Tags:    

Similar News