కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. గంపగోవర్ధన్, షబ్బీర్ అలీ మధ్య కొనసాగుతున్న సవాళ్ల పర్వం
Congress vs BRS డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నాణ్యతపై షబ్బీర్ అలీ సవాల్
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. గంపగోవర్ధన్, షబ్బీర్ అలీ మధ్య కొనసాగుతున్న సవాళ్ల పర్వం
Congress VS BRS: కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల ప్రతిసవాళ్లు పర్వం నడుస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపించిందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపిస్తుంటే. దమ్ముంటే నిరూపించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అంటున్నారు. కామారెడ్డిలో ఈ సవాళ్ల పర్వం రాజకీయంగా చర్చకు దారితీసింది
బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నాణ్యత లోపించిందని షబ్బీర్ అలీ ఆరోపించారు. కొద్ది రోజుల్లోనే ఈ ఇళ్లు కూలిపోతాయన్నారు. నాణ్యతా లోపాలను బయటపెడతామని. దమ్ముంటే గంపగోవర్ధన్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల వద్దకు రావాలంటూ షబ్బీర్ అలీ సవాల్ విసిరారు.
షబ్బీర్ అలీ సవాల్‌పై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్పందించారు. ఈ నెల 22 తర్వాత ఎప్పుడైనా వస్తానంటూ గంప గోవర్ధన్ స్పష్టం చేశారు. దమ్ముంటే ఇంజనీర్లను తీసుకుని రావాలని ప్రతిసవాల్ విసిరారు. తాను పారిపోనని. దొంగలా షబ్బీర్ అలీనే పారిపోతాడంటూ ఎద్దేవా చేశారు. నాణ్యతతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తున్నామని తెలిపారు.